సమస్యల పరిష్కారానికి నెలలో ఒకరోజు

Jun 18,2024 23:17

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తానెప్పుడూ అండగా అందుబాటులో ఉంటానని, తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నరసరా వుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌, మైనింగ్‌ అధికారులతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యే మంగళవారం సమీక్షిం చారు. పట్టణంలోని డంపింగ్‌ యార్డుపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని 10 రోజుల్లో పరిష్కరించాలని కమిషనర్‌కు సూచించారు. ఇందుకోసం ప్రైవేటు ల్యాండ్‌ లీజుకు తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. తాగునీరు ఒక్క పూట మాత్రమే ఇస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండు పూటలా తాగునీరిచ్చేలా చొరవ చూపాలని చెప్పారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేవని, అన్ని ప్రాంతాల్లోనూ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. రోడ్లను వీలైనంత త్వరగా మరమ్మ తులు చేయాలన్నారు. మట్టి మాఫి యాకు అడ్డుకట్ట వేసేందుకు మైనింగ్‌ అధికారులు చొరవ చూపాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌గా చేయాలన్న తన ఆకాంక్ష నేరవేరే విధంగా అధికారులు నీతి, నిజాయితీగా వ్యవహ రించాలని కోరారు. నెలలో ఒకరోజు సమ స్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహి ద్దామని, ప్రతి అధికారి కూడా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో పని చేయాల న్నారు. గత ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని, మున్సిపల్‌ నిధులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు. ఇదిలా ఉండగా తాగు నీటి వృథాను అరికట్టి పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని, ఇదే క్రమంలో ప్రజలు కూడా నీరు వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించు కోవాలని ఎమ్మెల్యే అన్నారు. నరసరావుపేట పట్టణం శాంతినగర్‌ వద్ద ఉన్న తాగునీటి చెరువును అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువు వద్ద నుండి కిలోమీటర్ల మేర ఖర్చేమీ లేకుండా పట్టణంలోకి నీరు సరఫరా అయ్యే వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా ప్రజలు నీటి కోసం అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు. పట్టణంలో పలుచోట్ల వీధి కుళాయిల ట్యాప్‌లు పని చేయకపోవడంతో నీరు వృథాగా పోతుందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డి, డిఇ శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కె.విజరు కుమార్‌, ఎన్‌.సుబ్బరాయ గుప్తా, వి.సింహాద్రి యాదవ్‌, చిన్నపరెడ్డి, కె.కిరణ్‌, కె.బాబు, జి.శేఖర్‌ పాల్గొన్నారు.

➡️