‘పది’ లమే

Apr 22,2024 23:08 #'పది' లమే

టెన్త్‌ ఫలితాల్లో కడప, అన్నమయ్య మెరుగైన స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో పార్వతీపురం, శ్రీకాకుళం తరువాత కడప మూడు, అన్నమయ్య జిల్లా 17వ స్థానంలో నిలిచాయి. టెన్త్‌ ఫలితాలను పరిశీలిస్తే కొంచెం మోదం కొంచెం ఖేదాన్ని కలిగించాయి. ఇంటర్‌ ఫలితాల్లో కడప, అన్నమయ్య జిల్లాల్లో నాలుగు స్థానాల్ని మెరుగుపరుచుకున్న సంగతి తెలిసిందే. టెన్త్‌ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా రెండు స్థానాల కిందకి పడిపోవడం ఆందోళన కలిగించింది. తాజా ఫలితాల్లోనూ 93.03 శాతం ఉత్తీర్ణతతో బాలికలే ఆధిపత్యం సంపాదించారు. టెన్త్‌ ఫలితాల్లో మెరుగైన స్థానాలను సాధించడంతో జిల్లా విద్యాశాఖ విజయవంతమైందని చెప్ప వచ్చు. కడప, అన్నమయ్య జిల్లాలు పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాయి. కడప జిల్లాలో 79.43 శాతం ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచింది. అన్నమయ్య జిల్లా 72.05 శాతం ఉత్తీర్ణతతో రెండు స్థానాల్ని కోల్పోయి 17వ స్థానంలో నిలిచింది. 2022-23 ఏప్రిల్‌లో నిర్వహించిన టెన్త్‌ పరీక్షలకు కడప జిల్లాలో 27,097 వేల మంది హాజరయ్యారు. బాలికలు 81.55 శాతం, బాలురు 77.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2021లో ఉమ్మడి కడప జిల్లా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆరవ స్థానం, 2022లో ఏడవ స్థానంలో నిలిచింది. 2023లో నాలుగో స్థానంలో నిలి చింది. తాజా ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 79.43 శాతం ఉత్తీర్ణత శాతంతో మూడవ స్థానంలో నిలవడం విశేషంగా ఆకర్షిస్తోంది. కడప జిల్లాలోని 36 మండలాల పరిధిలోని 589 పాఠశాలలకు చెందిన 27,729 మంది విద్యార్థులు ఉన్నారు. 973 ప్రయివేటు పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నారు. 202 జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాలల కేటగిరీలోని బి.కోడూరు మండ లానికి చెందిన గోవిందాయపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల సున్నా ఫలితాల స్థానంలో నిలిచింది.

➡️