పాళ్లమ్మ అమ్మవారి ఆలయ పున్ణ ప్రతిష్ట : పలువురు ప్రముఖుల సందర్శన

Feb 22,2024 14:14 #Celebrations, #Konaseema, #temple

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : ఈదరాడ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మ వారి నూతన ఆలయాని భక్తులు సహాకారం కోటి వ్యయము పున్ణ నిర్మించిన నూతన ఆలయాన్ని సుదర్సనం వెంకట జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో గురువారం యరుబండి సత్య నగేంద్ర వర ప్రసాద్‌ (శ్రీను ) అనంతలక్ష్మీ దంపతులతో అమ్మవారి పున్ణ ప్రతిష్ట, చిక్కం సురేంద్ర మేనిక దంపతులతో కలశ ప్రతిస్థాపన, జక్కంపూడి నాగభూషణం నాయుడు నాగమణి దంపతులతో పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మరో పదిమంది దంపతులతో పున్ణ ప్రతిష్ట జరుపబడింది. గ్రామస్తులు ఆలయ శిఖరం పై బూరెలు వేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. రాజోలు ఎం ఎల్‌ ఎ రాపాక వరప్రసాద్‌, పి గన్నవరం ఎం ఎల్‌ ఎ కొండేటి చిట్టి బాబు, ఎం పి పి కుసుమ వనజకుమారిశ్రీధర్‌,, జెడ్‌ పి టి సి కె అంజిబాబు, సర్పెంచ్‌ చుట్టగుళ్ల లక్ష్మీ రమేస్‌ బాబు జిల్లా దేవదాయ శాఖ కమిషనర్‌ ఎం విజయరాజు, జిల్లా అధికారి కె ఎన్‌ వి పి వి ప్రసాద్‌, తనిఖీదారు జె రామ లింగేశ్వరరావు, ఈ ఒ కె గంగా దర్‌ తదితరులు పాలుగుని అమ్మ వారి దర్శనం చేసుకున్నారు.

➡️