‘దివ్యాంగులు-ఓటు హక్కు’పై సమీక్ష

Mar 30,2024 15:06 #palnadu district

 అధికారులతో జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగులు స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లాలో అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి- జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం స్థానిక నరసరావుపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో దివ్యాంగులు ఓటు హక్కు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైన చోట దివ్యాంగులకు వీల్ చైర్లను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ డేస్క్, బ్రెయిలీ బ్యాలెట్ షీట్, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటుతో పాటు సహాయకుడిని ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బూతు లెవెల్ అధికారులు 85 ఏళ్ల పైబడిన వారికి మరియు దివ్యాంగులకు, వికలాంగులకు హోం ఓటింగ్ మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన సాక్ష్యం యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన విధానాల మేరకు దివ్యాంగులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకo, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️