కాలినడక వంతెన పనులు ప్రారంభించాలి

May 19,2024 23:26 #foot path works
Foot path works problem

ప్రజాశక్తి-మధురవాడ : జాతీయరహదారిపై చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఎదురుగా కాలి నడక వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని మధురవాడ పౌరసంక్షేమ సంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాష్‌ కోరారు. మధురవాడ శివశక్తి నగర్‌లో సంఘం కార్యవర్గ సభ్యులు సమావేశమై పరిసర ప్రాంతాల్లో సమస్యల గురించి చర్చించారు. ఎత్తు వంతెన కింద వర్షపు నీరు నిలిచిపోవడం, పౌర గ్రంథాలయ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తదితర సమస్యల పరిష్కారానికి అంతా కలిసి కట్టుగా కృషిచేయాలని సభ్యులు నిర్ణయించారు. కార్యక్రమంలో పి.నాగేశ్వరరావు, వై.ఈశ్వరరావు, బ్రహ్మాజి, జగన్మోహనరావు, శ్రీపాద వెంకటరమణ, ఎస్‌.రమేష్‌, బి.పాపారావు, వై.శ్రీనివాసరావు, వై.శంకరరావు, వంటాకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️