జలాశయంలో జాలరి మృతదేహాన్ని బయటకు తీసిన గజవేటగాళ్లు

గొలుగొండ (అనకాపల్లి) : చేపల వేటకు వెళ్లిన జాలరి జలాశయంలో గల్లంతవ్వగా అతడి మృతదేహాన్ని గుర్తించిన గజ వేటగాళ్లు బయటకు తీసిన ఘటన మంగళవారం గొలుగొండలో జరిగింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సాలికి మల్లవరం పంచాయతి పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు ఆదివారం రాత్రి చేపల వేటకు వెళ్ళగా బోటు బోల్తా పడి గల్లంతయ్యాడు. గజ వేటగాళ్లు ఎట్టకేలకు గేలాల సాయంతో, తాండవ రిజర్వాయర్లో మృతి చెందిన అప్పారావును బయటకు తీశారు. రెండు రోజులుగా పోలీసులు, అధికారులు స్థానికుల శ్రమ ఫలితంగానే అప్పారావు మృతదేహం లభ్యమైయిందని స్థానికులు అంటున్నారు.

➡️