‘సిపిఎం’తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

Apr 12,2024 12:57 #Nellore District
  •  సిపిఎం అభ్యర్థి మూలం రమేష్

ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తొత్తుగా, పొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడించి, అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న ఇండియా కూటమికి చెందిన సిపిఎం పార్టీని ఆదరించాలని సిపిఎం అభ్యర్ధి మూలం రమేష్ పిలుపు నిచ్చారు. శుక్రవారం 3, 4 డివిజన్ల పరిధిలోని రాజీవ్ గాంధీ కాలనీ ప్రాంతంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, నగర నియోజకవరం అసెంబ్లీ స్థానానికి ఇండియా కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మూలం రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా ఈ ప్రాంతం పెన్నా నదికి సమీపంలో ఉన్నప్పటికీ కలుషిత నీటిని కార్పోరే షన్ సరఫరా అవుతున్న నేపథ్యంలో ఇటీవల అనేక మంది ప్రజలు అనారోగ్యానికి గురై వైద్యశాలలకు పరుగులు తీశారన్నారు. ప్రభుత్వం స్పందించి కార్పోరేషన్ నుంచి సురక్షితమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మరో ప్రక్కప్రతి ఏడాది వరదలు సంభవించిన సమయంలో ప్రాంతం ముంపుకు గురౌతుందని, అంతే కాక ఎండా వరద నీటి ఉదృతికి భూభాగం కుంగిపోయి ఇళ్ళు పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ నేపధ్యం లో వరదలు సంభవించిన సమయంలో కలిగే నష్టాన్ని అధిగమించేందుకు పెన్నా నది ప్రాంతంలో రివెట్మెంట్ (రక్షణ గోడ) నిర్మించి ప్రజల ఆస్థులను కాపాడేందుకు ఈ ప్రభుత్వం కనీస భాద్యతగా తీసుకొని నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం అస్థవ్యస్థంగా మారిపోవడంతో దోమలు స్వారవిహారం చేస్తూ ప్రజలపై దాడి చేసి అనారోగ్యానికి గురుచేస్తున్నాయన్నారు. దోమ కాటుకు గురికాకుండా — ఉండేందుకు ఈ ప్రాంతంలో ప్రతి ఇళ్లు నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దోమల నివారణ చర్యలతోపాటు శానిటేషన్ కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో ఇంటి పన్ను పెంపు, వాటర్ ఛార్జీలు పెంపుదల, చివరకు చెత్త పన్ను విధించడం ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అనుసరించి ప్రత్యేక హెూదా ప్రకటించకుండా ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో నల్లదనాన్ని వెలికి తీసి ప్రతి నిరుపేద బ్యాంకు ఖాతాలో రూ. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్య మద్యతరగతి ప్రజలపై భారాలు మోపిందన్నారు. ధరలు తగ్గించేందుకు, నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నా రు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైయివేటీకరణ చేసి లక్షలాధది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాల రాసిందన్నారు. జిల్లాలోని పోర్టును కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టిందని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశను తయారు చేసిందన్నారు.ఆ నాడు ప్రజలు, కార్మికులు, రాజకీయ నాయకులు పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వామపక్షపార్టీలు ఒక అడుగు ముందుకు వేసి ప్రజలను, కార్మికులను, కర్షకులను చై తన్య పరిచి పోరాటం చేశాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న సిపిఎం పార్టీ ఎన్నికల గుర్తు సుత్తికొడవలి నక్ష్యత్రంపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మన్నూరు భాస్కరయ్య, నగర నాయకులు కత్తి శ్రీనివాసులు, జి. నాగేశ్వరరావు, టి.వి.వి ప్రసాద్, షేక్ మస్తాన్బీ, బి.పి. నరసింహ, నగర కమిటీ సభ్యులు చిరంజీవి, ఏమేలు, శాఖా కార్యదర్శులు రఫీ, రియాజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️