ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి 

Mar 20,2024 12:11 #Prakasam District

ప్రతి యువతీ యువకులకు  ఏపీవో రాంబాబు పిలుపు
ప్రజాశక్తి-మరిపూడి : 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని (SVEEP) కార్యక్రమంలో భాగంగా అదనపు కార్యక్రమ అధికారి గడ్డం రాంబాబు తెలిపారు. బుధవారం మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి మస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చాలామంది ఉపాధి కూలీలలో ఉపాధి పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి వివరణ ఇస్తూ ఎన్నికల కోడ్ కు ఉపాధి హామీ పనులకు ఎటువంటి సంబంధం లేదని పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి వేతనాలు తప్పనిసరిగా చెల్లిస్తామని వారికి తెలియపరిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు దాని ప్రాధాన్యత అనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముఖ్యంగా మహిళలకు బుధవారం నాడు ఎన్నికలపై అవగాహన కల్పించడం జరిగింది.

➡️