కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నాం

Mar 9,2024 23:30

ప్రజాశక్తి -శింగరాయకొండ
విద్యా వ్యవస్థ బాగలేదని చెబుతూనే ఉన్నాం. కానీ గ్రామంలోని స్కూలు వదిలి కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన అంశమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె మన్మధరావు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేటి విద్యా వ్యవస్థ – సవాలు అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తన చిన్నతనంలో తమగ్రామంలో బడి లేకపోతే పక్క ఊరెళ్లి చదువుకున్నామని, కానీ నేడు ఊళ్లో బడి ఉన్న కార్పొరేట్ స్కూలుకు ఎక్కడికో వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాను 30ఏళ్లు న్యాయవాదిగా, రెండేళ్లు న్యాయమూర్తిగా ఉన్నానని అన్నారు. గతంలో డాక్టర్ బి హరిబాబుతో జెవివి సభలకు వెళ్లానని, సంపూర్ణ మధ్య నిషేధం ఉద్యమాలు చేశానని అన్నారు. అవన్నీ తనకు న్యాయమూర్తిగా ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. 4844కేసులకు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. డాక్టర్ బి హరిబాబు శాస్త్రీయత విద్యావిధానంపై వివరించారు. ఆర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డాక్టర్ నూకసాని సుబ్బారావు, సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ప్రొఫెసర్ చొప్పర బాలకోటయ్య, వి నిరూపమ పాల్గొన్నారు.

➡️