శ్రీ మన విద్య స్కూల్‌ విద్యార్థిని ప్రతిభ

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2024 సంవత్సర పదో తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణంలోని శ్రీ మన విద్య ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థిని బెజ్జం సంజన 549 మార్కులు సాధించి స్కూల్‌ ఫస్ట్‌గా నిలిచి ప్రతిభ కనపరిచింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌ ప్రకాశరావు మాట్లాడుతూ తమ స్కూల్‌ విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు రావడం అభినందనీయం అన్నారు. విడుదల అయిన పది ఫలితాలలో తమ విద్యార్థిని బెజ్జం సంజన (స్మైలీ) 549 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అదే విధంగా వి శివసాయి శశాంక్‌ అనే విద్యార్థి 548, ఎన్‌ గోపి రవీంద్ర 536, కె సంజన 516 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్‌ ఫస్ట్‌ వచ్చిన బెజ్జం సంజన ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయగా అధ్యాపక సిబ్బంది అందరూ స్వీట్‌ తినిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక 400 పైబడి మార్కులు సాధించిన వారు మరో 12 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దటమే లక్ష్యంగా తమ పాఠశాల అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, తద్వారా విద్యార్థుల అభివృద్ధికి, ఉన్నత భవిష్యత్తుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ కె నరసింహారావును, ఇతర అధ్యాపకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

➡️