ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

May 12,2024 21:17

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ కోరారు. ఆర్‌డిఒ కార్యాల యంలో ఆదివారం పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా అధికారులను నియమించి మెటీరి యల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. గొడవలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఇవిఎంలు మొరాయిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. 264 పోలింగ్‌ బూత్‌లకు 264 ఇవిఎంలను పంపిణీ చేశారు. పిఒలు 264 మంది, ఎపిఒలు 264 మంది, ఒపిఒలు 1056 మందిని నియమించారు. నియోజకవర్గంలో రూట్లలో 31 సెక్టార్లను ఏర్పాటు చేసి రూట్‌, సెక్టార్‌ అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రిని ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.కలెక్టర్‌ సందర్శనస్థానిక ఆర్‌డిఒ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పరిశీలించారు. ఈసందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీ, ఎన్నికల సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌పై పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమెతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉన్నారు.భోజనాల కోసం నిరీక్షణఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద భోజనాల కోసం అధికారులు క్యూ లైన్లలో నిరీక్షించారు. ఎన్నికల నిర్వహణకు 1584 మందిని నియమించారు. రిజర్వ్‌లో మరో 150 మంది వరకు ఉంచారు. వీరందరికీ భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండు కౌంటర్లు మాత్రమే ఉంచారు. భోజనాల కోసం ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిశృంగవరపుకోట: నియోజకవర్గంలో సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. శృంగవ రపుకోట నియోజకవర్గంలో 270 పోలింగ్‌ బూతులకు సంబంధించి సిబ్బంది ఎన్నికల సామగ్రితో స్టేష న్లకు చేరారని ఆయన తెలిపారు. పోలి ంగ్‌ స్టేషన్లో సిబ్బందికి విద్యుత్‌, మరు గుదొడ్లు, భోజన వసతులతో కూడిన సౌకర్యాలను కల్పించామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలనవేపాడ: మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఎంపిడిఒ నిశ్చలత పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో మాట్లాడి, సూచనలు చేశారు. నిర్వహణలో ఏ విధమైన లోపాలున్నా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు.2048 మందితో పోలింగ్‌ ఏర్పాట్లుచీపురుపల్లి: చీపురుపల్లి నియోజకవర్గంలో 2048 పోలింగ్‌ సిబ్బందింతో పోలింగ్‌ జరిపేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సోమవారమే కావడంతో ఆదివారం గరివిడికి చెందిన ఎస్‌డిఎస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల వద్ద ఉదయం ఏడు గంటల నుండే పోలింగ్‌ సిబ్బంది పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని బి శాంతి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూటరీ సెంటర్‌ని సందర్శించిన కలెక్టర్‌గరివిడిలో గల ఎస్‌డిఎస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ సెంటర్‌ని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదివారం సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని రిటర్నింగ్‌ అధికారి బి శాంతిని ఆదేశించారు. వివిప్యాట్‌లను డిస్ట్రిబ్యూటరీ సెంటర్‌లోనే పరిశీలించి పోలింగ్‌ సిబ్బందికి అందజేయాలని కలెక్టర్‌ సూచించారు.248 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధంనెల్లిమర్ల: నియోజకవర్గంలో 248 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలకు సిద్ధం చేసి ఎన్నికల సామాగ్రి తరలించారు. ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం ఎంజెబిపి బిసి గురుకుల పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. 1248మంది ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సేవలు అందిస్తారు. నియోజకవర్గంలో 61 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికార్లు గుర్తించి ఆయా కేంద్రాల్లో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్‌ఒ ఎం.నూక రాజు, ఎఆర్‌ఒ డి. ధర్మ రాజు, పిఒ, ఎపిఒలకు ఎన్నికల సామాగ్రి ఇవిఎంలు, వివి ప్యాడ్లు కేటాయించి వాహనాల ద్వారా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. సొమ్మసిల్లి పడిపోయిన పోలింగ్‌ ఆఫీసర్‌డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో పోలింగ్‌ విధి నిర్వహణకు వచ్చిన పోలింగ్‌ ఆఫీసర్‌ పి. శ్రీమాధవన్‌ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు వచ్చి సపర్యలు చేశారు. మెడికల్‌ సిబ్బంది వైద్య తనిఖీలు చేశారు. ఆయన పూసపాటి రేగ మండలం పశుపాంలో పోలింగ్‌ అధికారిగా విధులు నిర్వహించాల్సి ఉంది. దత్తి రాజేరు మండలం పెదకాద ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సొమ్మసిల్లి పడిపోయి గంట సేపు అయినప్పటికీ పక్కనే వున్న రిటర్నింగ్‌ అధికారి నూకరాజు కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణా కళాశాల కేంద్రంలో ఉద్యోగి ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు వెంటనే వైద్య సిబ్బంది సపర్యలు చేశారు.

➡️