ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి : ఏపి జెఏసి

Feb 17,2024 15:54 #Konaseema

ప్రజాశక్తి-ఆలూరు(కర్నూలుఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఏపి జెఏసి ఛైర్మెన్ మోహన్,ఎన్జిఓస్ మండల కార్యదర్శి బాలకృష్ణ,పెన్షనర్ల మండల అధ్యక్షులు రామకృష్ణ అన్నారు.శనివారం ఏపి జెఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆలూరు తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్,జిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలన్నారు.12వ పిఆర్సి లో మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని,పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ 70-75 ఏళ్ళు ఉన్నవారికి 10 శాతం,75-80 ఏళ్ల వయస్సు ఉన్న వారికి 15శాతం మంజూరు చేయాలన్నారు. టీచర్స్ కు అప్రెంటీస్ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో పెన్షనర్లు గోవిందప్ప,మాజర్ భాష,యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాశిం,ఎస్టీయు మండలాధ్యక్షులు అశ్విన్ కుమార్,ఏపిటిఎఫ్ జిల్లా సభ్యులు శేషయ్య,క్లాస్ 4 యూనియన్ అధ్యక్షులు రంగస్వామి,రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు బసవన్న గౌడ్,ఎన్జిఓస్ సభ్యులు శేఖర్,ఉలిగప్ప పాల్గొన్నారు.

➡️