పనుగుపేటలో బోనెల ప్రచారం

Apr 6,2024 21:52

 ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని పునుగుపేటలో పార్వతీపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బోనెల విజరు చంద్ర ఎన్నికల ప్రచారం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆదుకుంటామన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తెంటు వెంకట అప్పలనాయుడు, వేణుగోపాలనాయుడు, డి.వెంకటనాయుడు, అరవింద్‌, రామకృష్ణ, భాస్కరరావు, పి.సత్యనారాయణ, పి.లక్ష్మణరావుతో పాటు జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజకవర్గ టిడిపి, జనసేన , బిజెపి ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపునకు జనసేన నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి గెలిపించి తీరుతామని నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన జనసేన నాయకులతో కలిసి గుమ్మలక్ష్మీపురంలో మాట్లాడారు. జనసైనికులంతా సమిష్టిగా కృషి చేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని, వైసిపిని ఓడించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పెంటా శంకరరావు, వాన ఉపేంద్ర, ఐటి కోఆర్డినేటర్‌ ఎల్‌.రంజిత్‌ కుమార్‌, గరుగుబిల్లి మండల అధ్యక్షుడు శంకరరావు, నాయకులు రాజేష్‌, అనంత కుమార్‌, భార్గవ్‌, రమేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️