ఎంసిసికి లోబడే ప్రచార అనుమతులు

ప్రజాశక్తి-కడప ఎన్నికల ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలులో సాధారణ ఎన్నికల దష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జెసి గణేష్‌ కుమార్‌, డిఆర్వో గంగాధర్‌ గౌడ్‌ లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో వి.విజరు రామరాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోదలిచే రాజకీయ పార్టీల ప్రతిని ధులు తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధ నలను పాటిస్తూ సంబందిత రిటర్నింగ్‌ అధికారుల వద్ద అనుమతి పొందాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశామని, జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన చర్యలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామన్నారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రత్యక్ష ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారించి చర్యలు చేపడతామని తెలిపారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలా పాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. నాయకుల ర్యాలీలు, స్టార్‌ క్యాంపె యిన్‌, రోడ్‌ షో లాంటి కార్యక్రమాల కోసం 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. డోర్‌ టూ డోర్‌ ప్రచా రానికి కూడా పర్మిషన్‌ తప్పక తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే అడ్వర్టైజ్మెంట్స్‌ లకు సంబంధించిన రేటింగ్‌ కార్డు ఇస్తామన్నారు. పార్టీ అభ్యర్థులు పర్మిషన్‌ తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుం దన్నారు. యంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో వ్యూయింగ్‌ టీం, ఎక్స్పెండేచర్డెచర్‌ మానిట రింగ్‌ తదితర టీములు జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తు న్నాయన్నారు. షాడో అబ్జర్వేషన్‌ కూడా 24/7 నిరంతర నిఘా నిర్వహిస్తామన్నారు. సీజర్‌ మేనే జ్మెంట్‌ సిస్టమ్‌ అంతా పారదర్శకంగా జరుగుతుం దన్నారు. క్రిటికల్‌, వల్నరబుల్‌ పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఫోర్స్‌ భద్రతతో పాటు వెబ్‌ క్యాస్టింగ్‌, సాధారణ పోలింగ్‌ స్టేషన్ల వద్ద పోలీసులతో పాటు ఎన్‌సిసి, స్కౌట్‌ గైడ్‌ ల సేవలను వినియోగిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూతు వద్ద స్త్రీ, పురుషులకు వేర్వేరు క్యూలైన్లు అలాగే సీనియర్‌ సిటీజన్లు, గర్భిణులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి.. ఈ నెల 17వ తేదీ లోపు అన్ని రకాల ఫారాలకు సంబంధించి అభ్యర్థనలు పరిశీలించి పూర్తి చేస్తామన్నారు. అభ్యర్థనలు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల విధులకు అన్ని

➡️