రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి-పామూరు : పామూరు పట్టణం లోని టివిఎస్‌ షోరూంలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ గుడిపాటి రంగనాయకులు, మండల అధ్యక్షుడు షేక్‌ మౌలాలి కేకు కట్‌ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మాజీ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి మరియు సమన్వయ కమిటీ సభ్యులు వేల్పుల రాజశేఖర్‌, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వర రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు సంగటి మల్లికార్జునరెడ్డి, కనిగిరి నియోజకవర్గ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సయ్యద్‌ పాశ్చాహుస్సేన్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు షేక్‌ మౌలాలి, హనుమంతుని పాడు మండల అధ్యక్షుడు బలసాని కోటేశ్వరరావు,చంద్రశేఖరపురం మండల అధ్యక్షులు షేక్‌ హజరత్‌, పామూరు పట్టణ అధ్యక్షుడు షేక్‌ సుభాని, వెలిగండ్ల మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు నడవ అంకయ్య, షేక్‌ వసీం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️