గుంటూరులో సర్పంచుల నిరసన ధర్నా

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ … ఉమ్మడి గుంటూరు జిల్లా ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్‌ఓ రోజాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ … పంచాయతీలకు రావలసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ఓడించాలని. జగన్మోహన్‌ రెడ్డి ఓటమి ద్వారానే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని అన్నారు.

➡️