రాజులో విజ్ఞాన ప్రదర్శన

Dec 21,2023 15:51 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజు పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, సీ ఈ ఓ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు వివిధ రకాల పరిశోధనల నమూనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ రామానుజన్ ఆచార్యుడిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, గణితం పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. తమ పాఠశాలలో ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు వారిచే వివిధ రకాల ప్రాజెక్టు నిర్వహణ చేయించడం జరుగుతోందని, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇంచార్జి శేషారెడ్డి, ఉపాధ్యాయినీ-ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️