15 వ డివిజన్‌ పరిధిలోని ఓటరు జాబితా పరిశీలన

Apr 2,2024 11:14 #Check, #Division, #Voter List

ప్రజాశక్తి -నెల్లూరు : స్థానిక 15 డివిజన్‌ పరిధిలో ఆ ప్రాంత సిపిఎం శాఖా సభ్యులు ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం బాలాజీ నగర్‌ 15వ డివిజన్లో 228,233 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాల కన్వీనర్లు, రామకఅష్ణ, రమణారెడ్డి, లు బసవయ్య వీధి, ఆంధ్ర బ్యాంకు వీధి, సచివాలయం వీధి, ఈ ఏరియాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర నియోజకవర్గానికి సిపిఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారని, ఆ అభ్యర్థిని కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

➡️