బాలయ్య పుట్టినరోజు – హిందూపురంలో అన్న క్యాంటీన్‌ పున: ప్రారంభం

హిందూపురం (శ్రీసత్యసాయి) : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ సోమవారం తన జన్మదిన వేడుకలను టిడిపి నేతలు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. స్వగృహంలో కేక్‌ కట్‌ కోసి తన అభిమాని అయిన నాలుగేళ్ల అనిత్‌కుమార్‌కు తినిపించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం, అన్న క్యాంటీన్‌ను పున: ప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళతామని, హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

➡️