చెక్ పోస్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి : ఎస్పీ కృష్ణకాంత్

Mar 5,2024 17:45 #AP police, #Kurnool

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతర్ రాష్ట్ర సరిహద్దు లో ఉన్న మంత్రాలయ మండల పరిధిలోని మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మాధవరం చెక్ పోస్టు (కర్ణాటక బార్డర్ ) వద్ద అక్రమ రవాణా నియంత్రణకు భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఆదేశించారు. మంగళవారం చెక్ పోస్టు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతమైన కర్నాటక, తెలంగాణాల రాష్ట్రాల నుండి డబ్బు, అక్రమ మద్యం రవాణా జరగకుండా కట్టడి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అక్రమ రవాణా పై నిఘా ను పటిష్టం చేయాలని సూచనలు చేశారు. వచ్చిన ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎమ్మిగనూరు డిఎస్పీ శ్రీ సీతారామయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, మంత్రాలయం సిఐ ఎరిషావలి, కోసిగి సిఐ ప్రసాద్, ఎస్సైలు గోపినాథ్ కృష్ణమూర్తి ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

➡️