ఉపాధికి నీలినీడలు

ప్రజాశక్తి-రాయచోటి/చాపాడు/పోరుమామిళ్ల ఉపాధి కూలీలకు అధిక ఎండలకు తిప్పలు తప్పడం లేదు. అందుకు అనుగుణంగా అలవెన్సులు, సేద తీరేందుకు వసతి కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్ని చాపకింద నీరులా సాగిస్తూనే ఉంది. ఉపాధి హామీ కూలీలకు వసతుల కల్పన కింద ఇవ్వా ల్సిన నగదు చెల్లింపులకు ఎగనామం పెట్టింది. టెంట్లు, తాగునీరు, మజ్జిగ, గడ ్డపారలు, తట్టా బుట్ట, వేసవి అలవెన్స్‌, మేట్ల తొలగింపు తదితర సదుపాయాలకు ఇవ్వా ల్సిన సుమారు రూ.60పైగా నిలిపేసింది. ఫలితంగా ఉపాధి కూలీలు ఎండల నుంచి ఉపశమనం లభించకపోవడంతో నిర్దేశిత కొలత పరిమాణంలో పనుల్ని చేయడం లేదనే పేరుతో సగానికిపైగా కూలిలో కోత విదిస్తుండటంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో, వంకలలో, పంట కాలువలలో ఉపాధి కూలీలకు వసతుల కల్పనలో ఉపాధి యంత్రాంగం విఫలమైంది. పని దినాల్లో కూడా కోత… కేంద్రంలోని బిజెపి సర్కారు ఉపాధి పనుల్లో పారదర్శకత పేరుతో తెచ్చిన టిసిఎస్‌ నుంచి ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ కింద డిమాండ్‌ పొందిన ఉపాధి కూలీలు వారంలో నాలుగు రోజులు పనులకు హాజరై మిగిలిన రెండు రోజులు వెళ్లకపోతే వారం రోజులపాటు ఉపాధి కల్పించినట్లు జమ చేసుకుంటోంది. ఫలితంగా డిమాండ్‌ పొందిన కూలీలు రెండు రోజుల ఉపాధిని వదులుకోవాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవి అలవెన్సులు, పనికి వెల్లిన రోజులు మాత్రమే నమోదు అయ్యేవి. ఉపాధి కూలి సగానికి పరిమితమైంది. ఉపాధి ప్రదేశాల్లో కూలీల సంరక్షణకు ఉద్దేశించిన సదుపాయాల కల్పనను తుంగలో తొక్కింది. ఫలితంగా కూలి రూ.300 మించి పడడం లేదు. ఉపాధి కూలీల వసతుల కల్పనకు ఇవ్వాల్సిన రూ.87 అలవెన్స్‌ను ఉపసంహరించుకుంది. గతంలో ఉపాధి కూలీలు రూ.30 వేసవి అలవెన్స్‌, మేట్‌ అలవెన్స్‌ రూ.27, తాగునీటికి రూ.ఐదు, గడ్డపారకు రూ.15, తట్టా బుట్టకు రూ.ఐదు, మజ్జిగకు రూ.ఐదు చొప్పున చెల్లించడం తెలిసిందే. టిసిఎస్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి కేంద్రం ఎన్‌ఐసి సాప్ట్‌వేర్‌లోకి మార డంతో కత్తిరింపులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి అల వెన్స్‌ను రూ.23 ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఐదు గంటలపాటు పని చేస్తేనే ఇస్తామని మెలిక పెట్టడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఫలితంగా వేసవి అలవెన్స్‌ పొందే అవకాశం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. తాగునీటికి, మజ్జిగకు, గడ్డపారకు, తట్టా బుట్టకు రూ.5 చొప్పున ఇవ్వాల్సిన అలవెన్స్‌కు తుంగలో తొక్కింది.పుట్టలు, చెట్లే టెంట్లుగా… ఉపాధి ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కూలీ లకు కంపచెట్లు, మట్టి పుట్టలు ఉపశమన కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగి స్తోంది. సుమారు 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కంపచెట్లు నీడనిస్తుండడం గమనార్హం. మండలంలో కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.300 వరకు పడుతుండడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఏటా 15 శాతం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలి రూ.500కు పెరగాల్సి ఉంది. వాస్తవంలో సగటు కూలిని పరిశీలిస్తే రూ.230 మించి పడడం లేదని తెలుస్తోంది. ఉపాధి పనుల కోసం ఇంటి నుంచి సుమారు 2కిమీ నడిచి వెళ్ళాల్సి వస్తున్నది. 5 కిమీ దూరం దాటితేనే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.ఉపాధి పనులే ఆధారంగా జీవనం ఉపాధి కూలీ పనులే ఆధారంగా బతుకుతున్నాం. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి కూలీని పెంచాలి. పెరుగుతున్న ధరలతో బతుకడం కష్టంగా మారింది. వేసవి లో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాము.- ఓబుళమ్మ, ఉపాధి కూలీ, సిద్దారెడ్డిపల్లె, చాపాడు.ఇంటి నుంచే నీరు తీసుకెళ్ళుతున్నాం ఉపాధి హామీ పనులకు వెళ్ళేటప్పుడు ఇంటి వద్ద నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నాం. ఎండలు ఎక్కువుగా ఉన్నాయి. పనులు చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం.- ఇ.మహేంద్ర,ఉపాధి కూలీ, దేవపట్ల, సంబేపల్లి.ఉపాధి హామీని బలోపేతం చేయాలి ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వేసవిలో పూర్తి గా ఉపాధి పథకం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.ఉపాధి పనుల దగ్గర వసతులు కల్పించాలి. దీంతో ఉపాధి కూలిని పెంచుకునే అవకాశం ఉంటుంది. – శివకుమార్‌, వ్య.కా.స, జిల్లా అధ్యక్షులు, వైఎస్‌ఆర్‌.దాహం తీర్చలేని ఉపాధి హామీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో మెడికల్‌ కిట్లు, తాగడానికి నీరు, పనిముట్లు, కూలీలకు నీడ సౌకర్యం ఉండటం లేదు. కూలీలకు సరైన సమయంలో బిల్లులు రావడం లేదు. ఉపాధి హామీ పని కావాల్సిన పరికరాలను కూడా ఉచింతగా పంపిణీ చేయాలి. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.- సి.రామచంద్ర, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య. ‘ఉపాధికి’ నీడ కరువు ..(మొదటిపేజీ తరువాయి) కలిగిస్తోంది. వేసవి అల వెన్స్‌ను రూ.23 ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఐదు గంటలపాటు పని చేస్తేనే ఇస్తామని మెలిక పెట్టడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఫలితంగా వేసవి అలవెన్స్‌ పొందే అవకాశం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. తాగునీటికి, మజ్జిగకు, గడ్డపారకు, తట్టా బుట్టకు రూ.5 చొప్పున ఇవ్వాల్సిన అలవెన్స్‌కు తుంగలో తొక్కింది.పుట్టలు, చెట్లే టెంట్లుగా… ఉపాధి ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కూలీ లకు కంపచెట్లు, మట్టి పుట్టలు ఉపశమన కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగి స్తోంది. సుమారు 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కంపచెట్లు నీడనిస్తుండడం గమనార్హం. మండలంలో కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.300 వరకు పడుతుండడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఏటా 15 శాతం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలి రూ.500కు పెరగాల్సి ఉంది. వాస్తవంలో సగటు కూలిని పరిశీలిస్తే రూ.230 మించి పడడం లేదని తెలుస్తోంది. ఉపాధి పనుల కోసం ఇంటి నుంచి సుమారు 2కిమీ నడిచి వెళ్ళాల్సి వస్తున్నది. 5 కిమీ దూరం దాటితేనే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.ఉపాధి పనులే ఆధారంగా జీవనం ఉపాధి కూలీ పనులే ఆధారంగా బతుకుతున్నాం. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి కూలీని పెంచాలి. పెరుగుతున్న ధరలతో బతుకడం కష్టంగా మారింది. వేసవి లో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాము.- ఓబుళమ్మ, ఉపాధి కూలీ, సిద్దారెడ్డిపల్లె, చాపాడు.ఇంటి నుంచే నీరు తీసుకెళ్ళుతున్నాం ఉపాధి హామీ పనులకు వెళ్ళేటప్పుడు ఇంటి వద్ద నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నాం. ఎండలు ఎక్కువుగా ఉన్నాయి. పనులు చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం.- ఇ.మహేంద్ర,ఉపాధి కూలీ, దేవపట్ల, సంబేపల్లి.ఉపాధి హామీని బలోపేతం చేయాలి ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వేసవిలో పూర్తి గా ఉపాధి పథకం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.ఉపాధి పనుల దగ్గర వసతులు కల్పించాలి. దీంతో ఉపాధి కూలిని పెంచుకునే అవకాశం ఉంటుంది. – శివకుమార్‌, వ్య.కా.స, జిల్లా అధ్యక్షులు, వైఎస్‌ఆర్‌.దాహం తీర్చలేని ఉపాధి హామీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో మెడికల్‌ కిట్లు, తాగడానికి నీరు, పనిముట్లు, కూలీలకు నీడ సౌకర్యం ఉండటం లేదు. కూలీలకు సరైన సమయంలో బిల్లులు రావడం లేదు. ఉపాధి హామీ పని కావాల్సిన పరికరాలను కూడా ఉచింతగా పంపిణీ చేయాలి. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.- సి.రామచంద్ర, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య.

➡️