శిద్దా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి-చీమకుర్తి : కృష్ణసాయి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత శిద్దా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో ఆదివారం నిర్వహించారు. కృష్ణసాయి పాలింగ్‌ యూనిట్‌-3 లో శిద్దా వెంకటేశ్వరరావు కార్మికులు,ఉద్యోగులు మధ్య భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కృష్ణసాయి ప్రతినిధి శిద్దా భరత్‌ మాట్లాడుతూ గనిలో ఉత్పత్తితోపాటు కార్మికుల భద్రత,సంక్షేమం రెండూ ముఖ్యమన్నారు.ఆరోగ్యం విషయంలో కార్మికులు జాగ్రత వహించాలన్నారు. ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రి ఎమ్‌డి ప్రసన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శిద్దా వెంకటేశ్వరరావు,శిద్దాభరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం చేశారు.ఒంగోలు ఉపాస ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా ఒంగోలు కర్నూలు రోడ్డుపై ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులకు బోనస్‌ అందజేశారు. భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదరు, జనరల్‌ మేనేజర్‌ మురళీమోహనరావు, మేనేజర్లు కమలాకర్‌, శ్రీనివాసులరెడ్డి, ఆంజనేయులు, కిషోర్‌ కుమార్‌, శ్రీనివాస్‌,ఉపాస ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్‌, సువర్ణరాజు, రామసుబ్బారెడ్డి, నవీన్‌ పాల్గొన్నారు.

➡️