అంగన్వాడీ నాయకురాలు సిఐటియులో చేరిక

Feb 29,2024 21:32

 సునీతను సిఐటియులోకి ఆహ్వానిస్తున్న అంగన్వాడీ యూనియన్‌ నాయకులు

                    హిందూపురం : హిందూపురం ప్రాజెక్ట్‌ ఎఐటియుసి నాయకురాలు సునీత గురువారం సిఐటియులో చేరారు. స్థానిక సిఐటియు కార్యలయంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, కోశాధికారి సోమందేపల్లి శ్రీదేవి, సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనువాసులు, కోశాధికారి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న సమక్షంలో సునీత సిఐటియులో చేరారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతు అంగన్వాడీ సమస్యలపై 42 రోజుల పాటు అలుపెరుగని పోరాటం చేసి, న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో కీలక పాత్రను పోషించడంతో సిఐటియులో చేరానన్నారు. రాబోవు రోజుల్లో సంఘ అభివృద్ధికి తన వంతు పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రాజెక్ట్‌ నాయకురాలు శోభ, లావణ్య, శిరీష, శైలజ, విజయలక్ష్మీ, సిఐటియు నాయకులు రాజప్ప, రామక్రిష్ణ, బాబా, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి తదితరులు పాల్గొన్నారు.

➡️