‘పురం’ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు అడుగులు

హిందూపురం రైల్వే స్టేషన్‌

      హిందూపురం : అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీంలో భాగంగా దేశ వ్యాప్తంగా 550 రైల్వే స్టేషన్‌లను ఎంపిక చేసి అందులో అభివృద్ధి పనులను చేయనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్‌లను ఎంపిక చేశారు. వాటిలో హిందూపురం రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేశారు. రూ.15కోట్ల నిధులతో హిందూపురం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేలా చర్యలను చేపట్టారు. ఈ నిధులతో ప్రయాణికులకు అనువుగా స్టేషన్‌ను ఆధునీకరణ చేయనున్నారు. ఈ పనులను సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. వీటితోపాటు రూ.23 కోట్లతో హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను వర్చువల్‌ విధానంతో ప్రారంభిస్తున్నారు. హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌లేటర్‌, లిఫ్టు, కోచ్‌ ఇండికేషన్‌ బోర్డులు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్న నేపథ్యంలో బెంగళూరు డిఆర్‌ఎంతో పాటు ఇతర రైల్వే అధికారులు ఆదివారం నాడు హిందూపురం రైల్వే స్టేషన్‌ను తనఖీ చేసి ఏర్పాట్లను పరిశీలన చేయనున్నారు. పనుల ప్రారంభంలో భాగంగా సోమవారం ఉదయం రైల్వే స్టేషన్‌లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర పనులను స్థానిక రైల్వే అధికారులు సోమప్ప, ఆనంద్‌తో పాటు స్టేషన్‌ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

➡️