పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

Feb 27,2024 22:05

పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

                          బత్తలపల్లి : జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం మండలంలోని మాల్యవంతం గ్రామంలో గల పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు వాటికి సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, సెక్టార్‌ ఆఫీసర్‌ భవ్య, డీఎస్పీ శ్రీనివాసులు, ఎఎస్‌ డాక్టర్‌ లక్ష్మీనరసింహశర్మ, ఎస్‌ఐ శ్రీనివాసులు, విఆర్‌ మణికుమార్‌, సెక్టార్‌ ఆఫీసర్లు, విఆర్‌ఎలు, బిఎల్‌ఒలు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలను సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు మంగళవారం తనిఖీచేశారు. పట్టణంలోని శాంతినగర్‌, గూడ్స్‌షెడ్‌, సంజరునగర్‌లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి ఓటరు ఓటు హక్కువినియోగించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకతతో కూడిన ఓటరు జాబితాను తయారు చేసేలా అందరు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటశివారెడ్డి, కమిషనర్‌ రాంకుమార్‌, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఈశ్వరయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, వన్‌ టౌన్‌ సిఐ సుబ్రమణ్యం, వీఆర్వో యోగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

➡️