సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు

Dec 5,2023 22:18

 సమ్మెనోటీసు అందజేస్తున్న ఉపాధ్యాయులు

       మడకశిర : సర్వ శిక్ష అభియాన్‌ పథకంలో పనిచేస్తున్న ఎమ్మార్సీల, పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మండల విద్యాధికారులు శ్రీనివాస భాస్కర్‌, నరసింహమూర్తికి సమ్మె నోటీసు అందజేశారు. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను పట్టించుకోవడంలేదని కుటుంబ పోషణ భారంగా ఉందని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు అందజేయడం జరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

➡️