టిడిపిలో చేరిన గ్రామ వాలంటీర్‌

బాలయ్య సమక్షంలో పార్టీలోకి చేరిన గ్రామ వాలంటీర్‌

       హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలం బీరేపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నగుడ్డంపల్లి గ్రామ వాలంటీర్‌ సుకన్య శ్రీనివాసులు బాలయ్య సమక్షంలో టిడిపిలో చేరారు. ఈమెకు కండువా కప్పి బాలకృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సుకన్య శ్రీనివాసులు మాట్లాడుతూ హిందూపురం ప్రాంతం బాలయ్యతోనే అభివృద్ది జరుగుతుందని తెలిసి పార్టీలోకి చేరానన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు రామాంజనేయులు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, బీరేపల్లీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️