24 నుంచి విత్తన వేరుశనగ పంపిణీ

May 17,2024 22:22

 సబ్సిడీ వేరుశన

                    అనంతపురం ప్రతినిధి : ఈనెల 24వ తేదీ నుంచి వేరుశగన విత్తనకాయల పంపిణీ ప్రారంభం కానుంది. నేటి నుంచి వేరుశనగ విత్తనకాయలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వేరుశనగ విత్తన సేకరణ ధరతోపాటు పంపిణీ ధరను నిర్ణయించారు. 40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ ధర కిలో రూ.57 ఖరీఫ్‌లో ఈ ఏడాది కె-6, టిసిజిఎస్‌ 1694 రకం రెండు రకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ విత్తనకాయలు కిలో రూ.95లు. సబ్సిడీ 40 శాతం ప్రకారం కిలో రూ.38 రాయితీ ఇచ్చారు. రైతుకు పంపిణీ చేస్తున్న ధర కిలో రూ.57. ఒక్కో రైతుకు విస్తీర్ణం బట్టి సరఫరా కేటాయించారు. అర ఎకరంలోపు 30 కిలోల బస్తా, సబ్సిడీపోనూ 30 కిలోల బస్తా రూ.1710 ఇవ్వనున్నారు. అర ఎకరం నుంచి ఒక ఎకరం వరకుంటే రెండు బస్తాలు, ఒక ఎకరంపై ఉన్న మూడు బస్తాలు ఇస్తారు. అంతరపంటల విత్తన సబ్సిడీలు నిర్ణయించాల్సి ఉంది. 81832 క్వింటాళ్లు కేటాయింపు అనంతపురం జిల్లాకు 81832 క్వింటాళ్లు సబ్సిడీతో పంపిణీకి కేటాయించారు. వేరుశనగ విత్తనకాయలు 76710 క్వింటాళ్లు కేటాయించారు. కంది విత్తనాలు 2300 క్వింటాళ్లు, బ్లాక్‌ గ్రామ్‌ 46 క్వింటాళ్లు, పెసలు 85 క్వింటాళ్లు, రాగులు నాలుగు క్వింటాళ్లు, కొర్రలు 50 క్వింటాళ్లు, వరి 1600 క్వింటాళ్లు, దాంచియీ 200 క్వింటాళ్లు, పిల్లిపెసర 25 క్వింటాళ్లు, ఉలవలు 700 క్వింటాళ్లు, కౌవ్‌పీ106 క్వింటాళ్లు, సన్‌హెప్‌ 7 క్వింటాళ్లు మొత్తం 81832 క్వింటాళ్లు కేటాయించారు. ఈ మేరకు మండలాల వారీగా కేటాయింపులు పూర్తయ్యాయి. విత్తన సేకరణకు అధికారులు సమయత్తమయ్యారు. విత్తన సేకరణకు సీడ్‌ మానిటరింగు సెల్‌ సార్వత్రిక ఎన్నికల విధుల్లోనున్న అధికార యంత్రాంగం ఇప్పుడు విత్తన సేకరణపై దృష్టి సారించింది. తక్కువ సమయం కావడంతో విత్తన సేకరణ వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. గత ఏడాది సేకరణలో కొంత సమస్య తలెత్తి పంపిణీలోనూ జాప్యం జరిగింది. ఈసారి అలా కాకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకోసం సీడ్‌ మానటరింగు సెల్‌ను జిల్లా కలెక్టరు వినోద్‌ కుమార్‌ ఏర్పాటు చేశారు. విత్తన సేకరణ, నాణ్యతను ఆయన శుక్రవారం స్వయంగా పరిశీలించారు.

➡️