అనంత ఎస్పీగా గౌతమి శాలి

గౌతమి శాలి

           అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. 2015 బ్యాచ్‌కు చెందిన గౌతమి శాలి గతంలో కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత విశాఖపట్నం డిసిపిగానూ, విజయనగరంలో 16వ బ్యాటలియన్‌ కమాండెంట్‌గానూ పనిచేశారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. జిల్లాలో ఎన్నికల అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ముందున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న ఉద్ధేశ్యంతో ఆయన్ను సస్పెండ్‌ అయ్యారు. ఆ స్థానంలో ఇప్పుడు కొత్త ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు.

➡️