ఈవీఎం స్ట్రాంగ్‌ రూములవద్ద పటిష్ట భద్రత : కలెక్టర్‌

         పుట్టపర్తి రూరల్‌ : ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా అధికారులతో కలిసి 159-పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, 20 హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయ సమీపంలోని వ్యవసాయ గోడౌన్‌లో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల భద్రత అత్యంత పటిష్టంగా పగడ్బందీగా ఉండాలన్నారు. ఎటువంటి లోపాలు ఉండకూడదన్నారు. స్ట్రాంగ్‌ రూములకు ఎక్కువ ద్వారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో 1571 పోలింగ్‌ కేంద్రాలు, 1909 బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌ 1909, వివి ప్యాట్‌లు ఆయా నియోజకవర్గాలకు పంపించామని తెలిపారు. 156-ఎస్సీ మడకశిర నియోజకవర్గానికి 241 పోలింగ్‌ కేంద్రాలకు 291 బ్యాలెట్‌ యూనిట్లు, 291 కంట్రోల్‌ యూనిట్‌ లు, 348 వివి ప్యాట్లు, 157 – హిందూపురం నియోజకవర్గానికి 253 పోలింగ్‌ కేంద్రాలుగాను 308 బ్యాలెట్‌ యూనిట్లు, 308 కంట్రోల్‌ యూనిట్లు, 361 వివి ప్యాట్‌ లు, 158 – పెనుగొండ నియోజకవర్గానికి 265 పోలింగ్‌ కేంద్రాలకు గాను 323 బ్యాలెట్‌ యూనిట్లు, 323 కంట్రోల్‌ యూనిట్లు, 376 వివి పాట్లు. 159- పుట్టపర్తి నియోజకవర్గంలోని 241 పోలింగ్‌ కేంద్రాల్లో 292 బ్యాలెట్‌ యూనిట్లు, 292 కంట్రోల్‌ యూనిట్లు, 342 వివి పాట్లు, 160- ధర్మవరం నియోజకవర్గానికి 290 పోలింగ్‌ కేంద్రాల్లో 353 బ్యాలెట్‌ యూనిట్లు, 353 కంట్రోల్‌ యూనిట్లు, 407 వివి ప్యాట్‌లు, 161- కదిరి నియోజకవర్గానికి 281 పోలింగ్‌ కేంద్రాల్లో 342 బ్యాలెట్‌ యూనిట్లు, 342 కంట్రోల్‌ యూనిట్లు, 39 వివి ప్యాట్లను పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్య రేఖ, డీఎస్పీ వాసుదేవన్‌, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, వెంకటస్వామి, డిప్యూటీ తహశీల్దార్‌ నరసింహులు, ఎం.శేఖర్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️