రోడ్డు ప్రమాదంలో వ్య.కా.స కోశాధికారి మృతి

Mar 28,2024 10:57 #sri satyasai district

ప్రజాశక్తి-శ్రీసత్యసాయి : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి గ్రామానికి చెందిన రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారిగా పని చేస్తున్నాడు. ఇతడు గత వారం రోజుల క్రితం తన స్వగ్రామం నుండి నల్లచెరువుకు వస్తుండగా మార్గమధ్యంలో మారిశెట్టిపల్లి గ్రామ శివారులో అతడు నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు అతని బంధువులు తెలిపారు.

➡️