నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం : పల్లె సింధూరరెడ్డి

Apr 16,2024 21:26

ఓటును అభ్యర్థిస్తున్న పల్లె సింధూరరెడ్డి

                      ఓబుళ దేవర చెరువు : నియోజకవర్గ ప్రజలకు పల్లె కుటుంబం అండగా ఉంటుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి అన్నారు. ఒడిసి మండల పరిధిలోని. తిప్పేపల్లి పంచాయతీ పరిధిలోని,ఎస్సీ కాలనీ,బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఉంట్ల వారి పల్లి, జేరికుంటపల్లి గ్రామాలలో పల్లె సింధూరరెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జడ్పిటిసి పిట్ట ఓబుల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌, జాకీర్‌ అహ్మద్‌, నిజాం మండోజి ఆరిఫ్‌ ఖాన్‌, షాను, చాంద్‌ బాషా, షబ్బీర్‌, బోయపల్లి శివారెడ్డి, బోర్‌ రమణ, అంజినప్ప, కృష్ణమూర్తి, కంచి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం : పల్లె

               పుట్టపర్తి రూరల్‌ : వైసిపిని వీడి టిడిపిలోకి చేరుతున్న నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పుట్టపర్తి మండల పరిధిలోని బుగ్గ పల్లి గ్రామంలో పలువురిని టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుగ్గపల్లి గ్రామానికి చెందిన లాయర్‌ సుభాష్‌, రవిచంద్ర అమర్నాథ్‌, బాలాజీ నాయక్‌, చంటిబాబులకు టిడిపి కండువాలు వేసి పార్టీలకు ఆహ్వానించారు. వీరి చేరిక వలన పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ విజరు కుమార్‌, నాయకులు పుల్లప్ప, శ్రీరామిరెడ్డి, శ్రీరామ్‌ నాయక్‌, నాగరాజు, మెహరాలి, అక్రమ్‌ భాష, కొట్లపల్లి కంసల నారాయణస్వామి, జగన్‌, రామయ్య, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి, మాజీ సర్పంచి పెద్దప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

18న నామినేషన్‌ : ఈనెల 18న పుట్టపర్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి నామినేషన్‌ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తరలిరావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆరు మండలాల ,పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని వారు కోరారు.

బుక్కపట్నం : సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎస్సీ సెల్‌ నియోజవర్గ అధ్యక్షురాలు సాకే యశోద రాయుడు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మారాల గ్రామపంచాయతీలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్‌సిక్స్‌ పథకాల నుంచి కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు పెద్దన్న, నరసింహులు, మల్లికార్జున, అశోక్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️