ఉద్దానం మునగకు భలే డిమాండ్‌

ఉద్దానం మునగకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భలే

అమ్ముతున్న రైతులు

రోజుకు రెండున్నర టన్నులు ఎగుమతి

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

ఉద్దానం మునగకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భలే డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ఉద్దానంలో మునగ పంట విరగ్గసిందని రైతులు చెబుతున్నారు. స్థానిక వ్యాపారులు రోజుకు రెండున్నర టన్నుల వరకు మునగకాయలను రైతులు వ్యపారుల నుంచి సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఎర్రమట్టి ఇసుక దిబ్బలు గల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో మునగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. తీర ప్రాంతంలో వాణిజ్య పంటలు లాభాదాయకం కావడంతో సుమారు 60 వేల ఎకరాల్లో జీడి, కొబ్బరి, మామిడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ జీడి, కొబ్బరి తోటల్లో మునగ పంటను అంతర పంటగా రైతుకు సాగుచేస్తున్నారు. మునగ పంట ఏడాదికి మూడుసార్లు కాపుకు వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి ముందు డిసెంబరు నుంచి వచ్చే పంటకు అధిక గిరాకీ ఉంటుంది. ప్రతి ఎకరా తోటలో ఖాళీ ఉన్న ప్రదేశాల్లో సుమారు పది నుంచి 20 వరకు చెట్లు ఉంటాయి. ప్రారంభంలో పలాస మార్కెట్లో మునగ కిలో ధర రూ.100 నుంచి ప్రారంభంమై ప్రస్తుతం రూ.40 వద్ద స్థిరంగా ఉంది.అపారమైన పోషక విలువలుఉద్దానంలో సాగుతున్న మునగలో అపారమైన పోషక విలువలు ఉన్నాయి. ఇక్కడ మునక్కాయలు రుచి కారణంగా ఉండడంతో వీటికి అప్పారమైన డిమాండ్‌ ఉంది. వీటి ఆకులను రసంలోను కూరగాను వినియోగిస్తారు. మట్టి సారం బాగుండడంతో పోషక విలువలు ఔషధ గుణాలు ఉంటాయని ప్రతిఒక్కరూ వినియోగిస్తారు. మునగే జీవనాధారంగ్రామాల్లో తిరుగుతూ రైతుల వద్ద మునగకాయలు సేకరిస్తూ పలాస మార్కెట్‌కి తీసుకొచ్చి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాను. లభ్యత బట్టి రోజుకు 20 నుంచి 30 కిలోల వరకు సేకరించి మార్కెట్‌కు తీసుకొస్తాను. సంవత్సరానికి మూడు సార్లు పండే ఈ మునగ పంటతో ఉపాధి లభిస్తుంది.- డి.తులసమ్మ, మహిళా వ్యాపారి, ఒంకులూరురూ.30 వేలు ఆదాయంసంక్రాంతి సీజన్‌లో మునగ పంట వల్ల రూ. 30 వేలు ఆదాయం వచ్చింది. దీంతో సంక్రాంతి ఖర్చులకు సరిపోయాయి. తీర ప్రాంత గ్రామాల్లోని చాలామంది రైతులకు మునక్కాయలు ఆర్థికంగా ఆదుకుంటాయి. ధర నిలకడ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.- ఎస్‌.ధనంజయరావు, రైతు, అక్కిపల్లిఒడిశాకే ఎక్కువ ఎగుమతిఉద్దానం మునక్కాయలు ఎక్కువగా ఒడిశాలోని బరంపురం, భువనేశ్వర్‌, భద్రక్‌, కటక్‌ ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. అహ్మదాబాద్‌ నుంచి మునక్కా యలు ఒడిశాకు దిగుమతి పోతున్నడంతో పాటు స్థానికంగా లభించే మునక్కాయలకు చిగురులు కుళ్లిపోవడంతో ధర తగ్గుతూ వస్తుంది. రూ.100 నుంచి రూ.40 కి ధర పడిపోయింది.- అచ్యుత పాత్రో, మునగకాయల వ్యాపారి, పలాస

 

➡️