ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యారంగ అభివృద్ధిలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు యుటిఎఫ్‌ సహకరిస్తుందని

మాట్లాడుతున్న ఎంఇఒలు

టెక్కలి : విద్యారంగ అభివృద్ధిలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు యుటిఎఫ్‌ సహకరిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక మండల రిసోర్స్‌ కార్యాలయంలో యుటిఎఫ్‌ నాయకులతో ఎంఇఒలు దల్లి తులసీరావురెడ్డి, దాసుపురం చిన్నారావులు యుటిఎఫ్‌ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు మాట్లాడుతూ టిడిఎస్‌ చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. బొరిగిపేట, పెద్దసానా ప్రాథమికోన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న హిందీ భాషా ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయిస్తామని అన్నారు. భగవాన్‌పురం ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పోలాకి ఈశ్వరరావుకు చెందిన నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరుపై అన్ని అర్హుతలూ ఉన్న కారణంగా మంజూరు చేయనున్నట్లు వారు హామీనిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు పడాల గణపతిరావు, తమ్మినేని వైకుంఠరావు, గౌరవ అధ్యక్షులు మారం కుమారస్వామి, జిల్లా సహ అధ్యక్షులు కురమాన దాలయ్య, పాలవలస ధర్మారావు, బమ్మిడి ఖగేశ్వరరావు, దవళ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

 

➡️