కేసుల రాజీకి కృషి చేయాలి

లీగల్‌ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

లీగల్‌ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులోని ఆయన ఛాంబరులో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ని సూర్యారావు, పొన్నాడ రాముతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. సమావేశంలో మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీదేవి, నాలుగో అదనపు న్యాయమూర్తి మహేంద్ర ఫణికుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు పాల్గొన్నారు.మోటారు వాహన ప్రమాద కేసుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో మోటారు వాహన ప్రమాద కేసుల రాజీకి ప్రీ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. న్యూ ఇండియా, యునైటెడ్‌ ఇండియా, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు, పిటిషనర్‌ తరపు న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు మోటారు వాహన ప్రమాద కేసుల వివరాలను చర్చించారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ని సూర్యారావు, పిరాము, మోటార్‌ ప్రమాద కేసుల్లో పిటిషనర్‌ తరుపు న్యాయవాదులు ఎల్‌.గోవిందరాజులు, జి.కృష్ణారావు, ఇన్సూరెన్స్‌ కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ కె.జీవరత్నం, ఎం.జనార్థనరావు, ఎస్‌.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️