జిల్లాకు కేంద్ర బలగాలు రాక

Mar 4,2024 22:08

ప్రజాశక్తి- శ్రీకాకుళం : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఎస్‌పి రాధిక ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేంద్ర బలగాలు శ్రీకాకుళం పట్టణ పరిధిలో ఉన్న పోలీసులతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో ఎస్‌పి మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, పోలీస్‌ సబ్‌ డివిజన్ల గురించి విపులంగా తెలియజేశారు. ఎన్నికలు సజువుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమన్వయం చేసుకొని పనిచేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి జి.ప్రేమ్‌కాజల్‌, డిఎస్‌పిలు వై.శ్రుతి, ఎల్‌.శేషాద్రి నాయడు, సిఐ సన్యాసినాయడు, తదితరులు పాల్గొన్నారు.

➡️