జీడి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

జీడి పిక్కల 80 కేజీల బస్తా రూ. 16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, ఎపి జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌

మాట్లాడుతున్న మోమనరావు

ప్రజాశక్తి- పలాస

జీడి పిక్కల 80 కేజీల బస్తా రూ. 16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, ఎపి జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ స్పష్టం చేశారు. కాశీబుగ్గ అమ్మ ఆశ్రమం వద్ద జీడి గిట్టుబాటు ధర కల్పించాలని, పిఎస్‌ ధనుంజయ రెడ్డితో జరగాల్సిన చర్చలపై బుధవారం రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాసలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలని డిమాండ్‌ చేశారు. జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ధరను స్థిరీకరించా లన్నారు. జీడి బోర్డు ఏర్పాటు చేసి పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జీడి పూత వస్తున్న కారణంగా పిచికారీ మందులు ఉచితంగా రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. వంశదార నుంచి ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలన్నారు. కొబ్బరి బోర్డులు ఏర్పాటు చేసి, కాయకు రూ.20 మద్దతు ధర ప్రకటిచి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో అఖిలభారత కిసాన్‌ మహాసభ జిల్లా కన్వీనర్‌ మద్దిల రామారావు, ఎపి కొబ్బరి రైతు సంఘం కో-కన్వీనర్లు సాతుపల్లి కృష్ణారావు, బత్తిని లక్ష్మీనారాయణ, కుత్తుం వినోద్‌కుమార్‌, తమ్మినన భాస్కర్‌, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పలాస పట్టణ నా యకులు పిన్నింటి నాగేశ్వరరావు, ఎపి రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గొరకల బాల కృష్ణ, పిఒడబ్ల్యు నాయకులు పాల్గొన్నారు.

 

➡️