పాతపట్నం చెక్‌పోస్టు పరిశీలన

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను

పాతపట్నం : పరిశీలిస్తున్న ఎస్‌పిలు

ప్రజాశక్తి- పాతపట్నం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను శ్రీకాకుళం ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, గజపతి జిల్లా ఎస్‌పి శ్వేతా కుమారి బుధవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం మరింత నిఘా పెంచాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేపట్టి విడిచిపెట్టాలని ఆదేశించారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం, పొగ, గుట్కా, గంజాయి దారులపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా ఎవరైనా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ఆమెతో పాటు టెక్కలి డిఎస్‌పి బాలచందర్‌రెడ్డి, పాతపట్నం సిఐ ఎం.సాయి, ఎస్‌ఐ మహమ్మద్‌ యాసిన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కవాతులో పాల్గొన్న ఎస్‌పి

కొత్తూరు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పారామిలటరీ బలగలతో నాలుగు రోడ్ల కూడలి వద్ద కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్‌పి జి.ఆర్‌.రాధిక పాల్గొన్నారు. అంత కుముందు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌ సిబ్బంది అప్రమత్తం గా ఉండాలన్నారు. టెక్కలి డిఎస్‌పి బాలచంద్రారెడ్డి, సిఐ ఆర్‌.వేణుగోపాలరావు, ఎస్‌ఐలు ఎం.ఎ. అహమ్మద్‌, నారాయణస్వామిలు పాల్గొన్నారు.

 

➡️