పోలింగ్‌ కేంద్రాలు పరిశీలన

మండలంలోని మాదిగాపురం, హరిదాస్‌పురం, కామధేనువు, సవరబాణాపురం, బోరుభద్ర, తెంబూరు, సింగుపురం, మజ్జి గోపాలపురం, ఆనందపురం, బోరుభద్ర, లట్టిగాం, పెద్దరావునిపల్లి తదితర

మాదిగాపురంలో పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరల్‌ కమర్‌

నందిగాం:

మండలంలోని మాదిగాపురం, హరిదాస్‌పురం, కామధేనువు, సవరబాణాపురం, బోరుభద్ర, తెంబూరు, సింగుపురం, మజ్జి గోపాలపురం, ఆనందపురం, బోరుభద్ర, లట్టిగాం, పెద్దరావునిపల్లి తదితర పోలింగ్‌ కేంద్రాలను టెక్కలి సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరల్‌ కమర్‌ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈయన వెంట తహశీల్దార్‌ పద్మావతి, విఆర్‌ఒలు ఉన్నారు.

 

➡️