ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ధేశించిన

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

విధుల నిర్వహణలో పూర్తి అవగాహన ఉండాలి

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ధేశించిన పట్టికలో వివరాలు సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. జెసి ఎం.నవీన్‌తో కలిసి నూతన కలెక్టరెట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ నోడల్‌ అధికారులు బృంద సభ్యులతో కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణ, తదితర అంశాలపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల నిర్వహణకు సంబంధించి ఏమేనా అనుమానలు ఉంటే అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత వచ్చిన పిర్యాదులు సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వాటికి సంబంధించి నిర్ధేశిత పట్టికలో తయారు చేసి సిఇఒ, డిఇఒకి అందజేయాలన్నారు. సోషల్‌ మీడియా చేపట్టాల్సిన పనులు, సి విజిల్‌పై పూర్తి స్థాయిలో అవగాహనా కలిగి ఉండాలన్నారు. మీడియా కంట్రోల్‌ రూమ్‌ బృందం 24 గంటలూ 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చి అంశాలను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ వివరాలు అందరికీ తెలియజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ సిహెచ్‌ రంగయ్య, నోడల్‌ అధికారులు డ్వామా పీడీ చిట్టిరాజు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌కుమార్‌, డిఎస్‌ఒ శాంతిశ్రీ, జిల్లా పరిషత్‌ సిఇఒ వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరులు, జిల్లా గృహనిర్మాణ అధికారి గణపతి, జిల్లా సమాచారం పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు పాల్గొన్నారు.

 

➡️