ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత

విసిలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె మీనా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సి-విజిల్‌ యాప్‌, ఇఎస్‌ఎంఎస్‌ ఫిర్యాదులు, ఎంసిసి, ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలపై కలెక్టర్టలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-7, 8ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతులను సకాలంలో ఇవ్వలని, సివిజిల్‌ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పటిష్టంగా అమలుపరచాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపడుతున్న చర్యలను వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సమావేశంలో జెసి ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆర్‌డిఒలు భరత్‌నాయక్‌, దొర, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, అప్పారావు, రామ్మోహన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సిహెచ్‌.రంగయ్య, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

 

➡️