బాల్య వివాహాలతో అనర్థాలు

సమాజంలో బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని

నౌపడ : ప్రతిజ్ఞ చేయిస్తున్న సీతారాములు

ప్రజాశక్తి- కవిటి

సమాజంలో బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎపిఎం కె.గోవింద్‌ అన్నారు. భేటీ బచావో, భేతీ పడావోలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన, బాల్య వివాహాల నిషేధిత చట్టం-2006పై స్థానిక మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఎపిఎం మాట్లాడుతూ బాలల రక్షణ కమిటీల ద్వారా పొదుపు సంఘాల మహిళలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రక్షణ విభాగం న్యాయ పర్యవేక్షణ సిబ్బంది శ్రీలత, లక్ష్మణ, సామాజిక కార్యకర్త మధురమీనాక్షి పాల్గొన్నారు. నౌపడ: బాల్య వివాహాలను అరికట్టి బాలల హక్కులు, సంరక్షణకు పాటు పడాలని జిల్లా బాలల రక్షణ విభాగం కౌన్సిలర్‌ ధర్మాన సీతారాములు కోరారు. సంతబొమ్మాళి మండలం వెలుగు కార్యాలయంలో గురువారం ఎపిఎం తుంగాన సూర్యనారాయణ ఆధ్వర్యాన బాల్య వివాహ నిషేధ చట్టం జిఎం నంబరు 31పై మహిళా సంఘాలకు గురువారం అవగాహన కల్పించారు. బాలల రక్షణ ఫోక్సో యాక్టు, విద్యాహక్కు చట్టం, గర్భలింగ నిర్ధారణ పరీక్షల నిషేద చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.

 

➡️