బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవలు భేష్‌

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అభినందించారు. మన్‌ కి బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యూత్‌క్లబ్‌ సేవలను

కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అభినందించారు. మన్‌ కి బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యూత్‌క్లబ్‌ సేవలను కొనియాడడం గర్వకారణమన్నారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు ఎం.ప్రసాదరావు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు మంచి గుర్తింపు తేవాలన్నారు. కొంతకాలంగా బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అడగడంతో, 1996 నుంచి యూత్‌ క్లబ్‌ చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

➡️