ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్‌ పరిధిలో విదేశీ వన్య ప్రాణులను

అరెస్టు అయిన స్మగ్లర్లు

పలాస :

కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్‌ పరిధిలో విదేశీ వన్య ప్రాణులను తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా స్మగ్లర్లను ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు దగ్గర పట్టుకుని అరెస్టు చేశామని కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్‌ ఆఫీసర్‌ ఎ.మురళీకృష్ణ నాయుడు తెలిపారు. ఈ మేరకు కాశీబుగ్గలో ఆయన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాల ను వెల్లడించారు. అస్సాంలోని కోతుల బ్రీడ్‌ సెంటర్‌ నుంచి రెండు కోతులను కొనుగోలు చేసిన కేరళ వాసి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరభ్‌ ముండల్‌, ధనుంజయ సింగ్‌ ముఖేష్‌ రామ్‌లతో ఆన్‌లైన్‌లో వెహికల్‌ బుక్‌ చేసుకున్నా రని రేంజర్‌ తెలిపారు. వారితో తమిళనాడు రాజధాని చెన్నైకు కోతులను చేర్చేలా కిరాయికి బేరం కుదుర్చుకున్నారని చెప్పారు. కారులో సౌత్‌ ఆఫ్రికాలోని ఉగాండా పర్వత శ్రేణుల్లో సంచరించే అటవీ జాతి సంతతికి చెందిన రెండు అరుదైన సన్‌ టైల్డ్‌ మంకీ, మౌంటైన్‌ మంకీ, (ఎల్‌ హోస్టు) ఆడ, మగ మంకీలను స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేశామన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ యాక్టు కింద పశ్చిమబెంగాల్‌కు చెందిన సౌరభ్‌ ముండల్‌, ధనుంజయ సింగ్‌ ముఖేష్‌ రామ్‌ అనే ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి ఇచ్ఛాపురం మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. జడ్జి వారికి 14 రోజులు రిమాండ్‌ విధించారని తెలిపారు.

 

➡️