రంగు మారిన ధాన్యం తిరస్కరణ

మిచౌంగ్‌ తుపాను

మిల్లు ముందు నిరసన తెలుపుతున్న రైతులు

  • కొనుగోలు చేయాలని రైతుల నిరసన
  • అధికారుల జోక్యంతో కొనుగోలు

ప్రజాశక్తి- పొందూరు

మిచౌంగ్‌ తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోకపోవడంతో మండలంలోని బాతువకు చెందిన కొంచాడ సమీపంలోని లకీëరాజ్యం రైస్‌మిల్లు వద్ద గురువారం నిరసన చేపట్టారు. బాతువకు చెందిన ఎనిమిది మంది రైతులు 800 క్వింటాళ్ల ధాన్యాన్ని లారీతో బుధవారం మిల్లుకు తీసుకొచ్చారు. అందులో ఒక రైతుకు చెందిన ధాన్యం సుమారు 28 శాతం రంగు మారిందని కొనుగోలుకు మిల్లర్లు తిరస్కరించారు. దీంతో రైతులు మిల్లు వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. రంగు మారిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, మిల్లర్లు మాత్రం కొనడం లేదని వాపోయారు. బాగున్న ధాన్యానికి సైతం అదనంగా నాలుగు కేజీలు తీసుకుంటున్నారని చెప్పారు. విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పరిశీలించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వగా, జిల్లా సివిల్‌ సఫ్లై మేనేజర్‌ శ్రీనివాసరావు బుధవారం మిల్లు వద్దకు వచ్చి ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు చేయాలని మిల్లరును ఆదేశించడంతో చివరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

 

 

➡️