రోటరీ సేవలు అభినందనీయం

Nov 23,2023 21:43
సామాన్యులకు రోటరీ క్లబ్‌ చేస్తున్న సేవలు అమోఘమని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యాన సోంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో

ప్రజాశక్తి- సోంపేట

సామాన్యులకు రోటరీ క్లబ్‌ చేస్తున్న సేవలు అమోఘమని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యాన సోంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసేందుకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని అన్నారు. దీనికోసం రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ముందుకు వచ్చి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపిపి డాక్టర్‌ నిమ్మన దాసు, సర్పంచ్‌ నగిరి ప్రభావతి, ఎంపిటిసి పొడుగు కామేశ్వరరావు, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

శంకుస్థాపన చేస్తున్న విజయ

➡️