విద్యార్థికి ఆర్థికసాయం

ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్న కవిటికి చెందిన నర్సిపురం

ఆర్థికసాయం అందిస్తున్న సభ్యులు

ప్రజాశక్తి- కవిటి

ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్న కవిటికి చెందిన నర్సిపురం అవినాష్‌ను చింతామణి ట్రస్టు దత్తత తీసుకుంది. ఈ మేరకు స్థానిక సర్పంచ్‌ పూడి లక్ష్మణరావు, చింతామణి ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా గురువారం విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థికసాయం అందించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థుల చదువుకు చేయూత అందిస్తున్న చింతామణి అమ్మవారి ట్రస్టు సేవలు అభినందనీయమని కొనియాడారు. అటువంటి ట్రస్టు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కవిటికి చెందిన నర్సిపురం అనే ఇంజినీరింగ్‌ నిరుపేద విద్యార్థి చదువు పూర్తిచేసే వరకు బాధ్యత తీసుకోవడం ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో ఉషోదయ యువజన సంఘం అధ్యక్షుడు పాండవ శేఖర్‌, మాజీ సర్పంచ్‌లు ఆరంగి మధు, బెందాళం వెంకటేశ్వరరావు, ఆగ్నికుల క్షత్రియ సంఘం నాయుడు పొల్లాయి లక్ష్మణమూర్తి, ఆరంగి రాజు, భావన రవి, జన్ని లోకనాథం, బాలక శ్రీను, పొల్లాయి ఉమా మహేశ్వరరావు, పి.అప్పారావు, పి.సింహాచలం పాల్గొన్నారు.

 

➡️