వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశం మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచనపై ఎచ్చెర్లలోని టిటిడిసిలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వినియోగదారుల హక్కులు, చట్టాలపై బుధవారం న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తప్పనిసరిగా కొన్న వస్తువుకి రసీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్‌, డిస్టర్బ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి.రమణ, టిటిడిసి ఇన్‌ఛార్జిలు వరాహ నరసింహులు, కృష్ణారావు, ట్రైనర్‌ సింహాద్రి నాయుడు, నాగమణి, ప్రభావతి, సూర్యప్రకాశ్‌రెడి, ప్రియాపాల్‌, రామ్మోహన్‌ పాల్గొన్నారు. పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరంపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, యజమానులు శిక్షకు గురవుతారని, చిన్న పిల్లల భవిష్యత్‌కు చదువు మాత్రమే మార్గం చూపుతుందని, పిల్లలను బడిలో చేర్పించాలని ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. ఆపరేషన్‌ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా చిలకపాలెంలో రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ లేబర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపుల యజమానులు చిన్నపిల్లలను పనిలో పెట్టుకున్నారా? అనే విషయంపై ఆరాతీశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి.రమణ, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావు, న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లు కొండలరావు, ఆర్‌వి శ్రీనివాసరావు, ఎన్‌జిఒలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️