వైసిపిలో పలువురు చేరిక

స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలం అల్లివలస పంచాయతీలో జనసేన, టిడిపి

రణస్థలం : పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌

ప్రజాశక్తి- రణస్థలం

స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలం అల్లివలస పంచాయతీలో జనసేన, టిడిపి పార్టీ నుంచి 54 కుటుంబాలు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ సమక్షంలో ఆదివారం వైసిపిలో చేరారు. పార్టీలోనికి చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వనించారు. పార్టీలో చేరిన వారిలో చీకటి ధనలక్ష్మణరాజు, మైలపల్లి కాముడు, వాసుపల్లి రాముడు, చీకటి పెద్దయర్రయ్య తదితరులున్నారు. కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకటరెడ్డి, వైస్‌ ఎంపిపి ప్రతినిధి మైలపల్లి కామరాజు, అల్లివలస పంచాయతీ సర్పంచ్‌ ప్రతినిధి చీకటి యర్రయ్య, వైసిపి నాయకులు మైలపల్లి వెంకటేష్‌, దుమ్ము పండోడు, మాగుపల్లి సోమయ్య, వాసుపల్లి బుజ్జి, దుమ్ము పొట్టివాడు, మాగుపల్లి పొట్టివాడు పాల్గొన్నారు.పోలాకి : నరసన్నపేట, పరిసర గ్రామాలకు టిడిపి, జనసేన నాయకులు 200 మంది వైసిపిలోకి చేరారు. వీరికి జెడ్‌పిటిసి డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య వైసిపి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దండి జయప్రకాష్‌, తర్ర చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.పలాస : పలాస మంత్రి కార్యాలయంలో ఆదివారం పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో మందస మండలం హరిపురానికి యువకులు టిడిపి నుంచి వైసిపిలో చేరారు. వారికి మంత్రి అప్పలరాజు వైసిపి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపిలో చేరిన వారిలో యలగా వంశీ, జన్నీ, దుర్గ, రోకల్లా మహేష్‌, తమ్మిరెడ్డి శేఖర్‌, గోకర్ల దుర్యోధన్‌, డబ్బీరు రంజిత్‌, జగన్నాథపురం అజరు, అనల రాజు, జన్నీ, ప్రశాంత్‌, రట్టి దీపక్‌, తామడ కన్నబాబు ఉన్నారు. కార్యక్రమంలో పసుపురెడ్డి ప్రదీప్‌ కుమార్‌, సాలిన నాని, బత్తిన చిరంజీవి, మావుడెల్లి రాజేష్‌, టేకి రాజేష్‌, మావుడెల్లి జీవన్‌, ఉమాశంకర్‌, పాండవ సాయి, నెయ్యాల కవి, ఖగేష్‌ పాల్గొన్నారు.

 

➡️