స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు

ఇచ్ఛాపురంలో స్విమ్మింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక

ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురంలో స్విమ్మింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్షి అన్నారు. గతనెల తిరుపతిలో జరిగిన అండర్‌-19 రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటిల్లో 3వ స్థానం సాధించిన స్విమ్మింగ్‌ క్రీడాకారులు సింహాచలం బెహరా, గోవింద్‌ బెహరా, తరుణ్‌ బెహరాలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్లు, మెడల్స్‌ బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులతో మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి స్విమ్మింగ్‌ క్రీడల్లో విద్యార్థులు, యువత ఆసక్తి చూపుతున్నారని, స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని రానిస్తున్నారన్నారు. పట్టణంలో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ నీలాపు ఢిల్లీ, స్విమ్మింగ్‌ కోచ్‌ బత్తుల రామారావు పాల్గొన్నారు.

 

➡️